Home Page SliderNational

‘అస్సాం టు కన్యాకుమారి’ ట్రైన్‌లో పొగలు –కంగారులో చైన్ లాగిన ప్రయాణికులు

‘ఫలక్ నామా’ ట్రైన్‌లో అగ్ని ప్రమాదం మరిచిపోకముందే మరో ట్రైన్‌లో పొగలు కలకలం రేపాయి. దేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే వివేక్ ఎక్స్‌ప్రైస్‌లో పొగలు రావడంతో ప్రయాణికలు చాలా కంగారు పడ్డారు. వెంటనే చైన్ లాగి కిందకు దూకేశారు. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘడ్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకూ 4,218 మైళ్ల దూరం 80 గంటల పాటు ప్రయాణం చేస్తుంది. దీనితో ప్రయాణికులు చాలా టెన్షన్ పడ్డారు. ఒడిశాలోని బ్రహ్మపుర్ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రయాణించే సమయంలో ఈ రైలులో ఎస్ 10 బోగీలోనుండి పొగలు రావడంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే చైన్ లాగారు. అనంతరం రైల్వేసిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైలును పరిశీలించగా అగ్ని ప్రమాదం జరగలేదని తెలిసింది. అయితే ఎస్ 10 బోగీలో రైలు చక్రంలో ఒక సంచి ఇరుక్కుపోయిందని, దానితో బ్రేక్ బైండింగ్ అయి పొగలు వచ్చాయని తెలిసింది. ఆ సంచిని తొలగించి, బ్రేకును సరిచేశారు. దీనితో రైలు 20 నిముషాలు ఆలస్యమయ్యింది. తరువాతి స్టేషన్ బ్రహ్మపురి చేరుకున్నాక, మరోసారి బాగా తనిఖీలు చేస్తామని తెలిపారు. దీనితో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు.