Home Page SliderNational

యూట్యూబ్‌లో దూసుకుపోతున్న BRO టీజర్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా “BRO”. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ నిన్న సాయంత్రం 5:04 గంటలకు విడుదలైంది. కాగా విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో 17 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో ఈ BRO టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్ నెం.1లో కొనసాగుతోంది. అయితే ఈ టీజర్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్,సాయిధరమ్ తేజ్ కాంబోలోని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో వింటేజ్ పవన్‌ను చూశామంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. కాగా BRO టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా దీనిపై స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.