Home Page SliderTelangana

కనీవినీ ఎరుగని రీతిలో ‘లక్షల మందితో ఖమ్మం సభ నిర్వహస్తా’- పొంగులేటి

జూలై 2న ఖమ్మంలో జిగనున్న కాంగ్రెస్ మహాసభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని, ఎన్ని లక్షల మంది వస్తారో లెక్క రాసుకోండంటూ బీఆర్‌ఎస్ పార్టీకి సవాలు విసిరారు మాజీ ఎంపీ పొంగులేటి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిందని పొంగులేటి అన్నారు.  కేసీఆర్ మాయల గారడి చేస్తున్నాడన్నారు. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ జరిగిన అనంతరం జూపల్లి, పొంగులేటి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. తామిద్దరూ రాహుల్ సమక్షంలో జూలై 2న కాంగ్రెస్‌లో చేరబోతున్నామని ప్రకటించారు.