Home Page SliderNational

ప్రముఖ నటుడికి యాక్సిడెంట్..కాలు తొలగించిన వైద్యులు

గతకొన్ని రోజులుగా సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కాగా నిన్న కన్నడ నటుడు ధ్రువన్(సూరజ్ కుమార్)రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.అయితే  ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన నిన్న మైసూర్-గుడ్లుపేట్ జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తుండగా లారినీ ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ధ్రువన్ కుడి కాలు నుజ్జునుజ్జవడంతో ఆపరేషన్ చేసిన వైద్యులు కుడి కాలును తొలగించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆవేదన పడుతున్నారు. కాగా ధ్రువన్ కన్నడ ప్రముఖ నిర్మాత ఎస్‌ఏ శ్రీనివాస్ కుమారుడు. అంతేకాకుండా ధ్రువన్ కన్నడ లెజండరీ హీరో దివంగత రాజ్ కుమార్‌కు స్వయాన మేనల్లుడని తెలుస్తోంది.