టెన్ జనపథ్‌లో హీటెక్కుతున్న టీ పీసీసీ రాజకీయాలు
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య టీపీసీసీ నేతలంతా దిల్లీలోని టెన్ జనపథ్‌లో కేంద్ర నాయకులతో సమావేశాలు జరుపుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుండి వచ్చిన పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్‌లోకి చేరుతున్న సందర్భంగా ఈ భేటీలు ప్రాధ్యాన్యత సంతరించుకున్నాయి. మరోపక్క వైయస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల తమ పార్టీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి షర్మిల పార్టీ విలీనంపై సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా దిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికే రేణుకా చౌదరి తన వెర్షన్‌ను మల్లికార్జున ఖర్గేకు వినిపించారు.