శ్రీవాణి ట్రస్ట్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడి
టీటీడికి చెందిన శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, వాటికి లెక్కలు సరిగ్గా చూపించడంలేదని, రశీదులు ఇవ్వడం లేదని ఆరోపణలు చేసిన చంద్రబాబు వ్యాఖ్యలు సీరియస్గా తీసుకుంది టీటీడి. ప్రతీ పైసాకి రశీదు ఇస్తున్నామని, లెక్కలున్నాయని పేర్కొంటూ శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ ట్రస్ట్ర్కు వివిధ బ్యాంకుల్లో 603 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని, వాటిపై వడ్డీ రూపంలో 36 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. పురాతన ఆలయాలు పునరుద్దరణ పనులకు కొంత ఖర్చు చేశామని తెలిపారు. ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్వామివారి సొమ్మును తీసుకుంటే ఎంతటి వారైనా శిక్షింపబడతారని వ్యాఖ్యానించారు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి.