Home Page SliderNational

సెప్టెంబర్ 15న థియేటర్లను షేక్ చేయనున్న “బోయపాటిరాపో”

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో “బోయపాటిరాపో” సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదల తేది మారినట్లు తెలుస్తోంది. గతంలో ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కానుందని మేకర్స్ తెలిపారు.అయితే ప్రకటించిన తేది కంటే ముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ సినిమాలో హీరో రామ్‌కు జోడీగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన హీరో,హీరోయిన్  ఫస్ట్ లుక్ పోస్టర్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.మరోవైపు మాస్ హీరో,మాస్ డైరెక్టర్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి అతి త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాల్సివుంది.