Home Page SliderNational

కేకలు వినిపించకుండా మ్యూజిక్ పెట్టి యువతిని టార్చర్ చేసి,చంపిన రా ‘బంధువులు’

సమీనా అనే 23 సంవత్సరాల యువతిని దొంగతనం చేసిందనే అనుమానంతో  చిత్రహింసలు పెట్టి, ఆమె బంధువులే చంపేసిన దారుణ సంఘటన ఘజియాబాద్‌లో జరిగింది. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ‘రాబంధు’ల్లా పీక్కు తిన్నారా బంధువులు. ఆమె కేకలు బయటకు వినిపించకుండా పెద్దసౌండ్‌తో మ్యూజిక్ పెట్టి ఆమెపై అమానుషంగా ప్రవర్తించారు. బ్లేడుతో ఆమె శరీరంపై గాయాలు చేసి, ఇనుప రాడ్స్‌తో బలంగా కొట్టి ఆమెను రెండురోజుల పాటు చనిపోయేంతగా కిరాతకంగా హింసించారు వారు. ఘజియాబాద్‌లోని సిద్దార్థ్ నగర్‌లో ఉండే  హీనా, రమేష్ అనే దంపతుల ఇంటికి వారి కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన పార్టీకి వెళ్లింది సమీనా. ఆసమయంలో వారి వద్ద ఉండే 5 లక్షల రూపాయల విలువ చేసే నగలు కనిపించకపోవడంతో సమీనాను అనుమానించి, ఇలా రాక్షసంగా హింసించారు. ఈ టార్చర్ కారణంగానే ఆమె చనిపోయింది. రెండురోజులుగా వారి ఇంట్లో నుండి పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ వస్తూండడంతో అనుమానించి, చుట్టుపక్కల ఇళ్లవారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సమాచారం అందిన పోలీసులు వచ్చేసరికి వారు మ్యూజిక్‌ను అలాగే ఉంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సమీనాను హత్య చేసిన హీనా

,రమేష్ దంపతులు