Andhra PradeshHome Page Slider

ఉద్యోగుల సంక్షేమంపై సీఎం జగన్ చిత్తశుద్ధికి హ్యాట్సాఫ్

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ఏపీ జేఏసీ అమరావతితో సహా పలు ఉద్యోగ సంఘాల నేతలు కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమంపై సీఎం జగన్ చిత్తశుద్ధికి హ్యాట్సాఫ్.. అంటూ ఏపీ ఉద్యోగుల సంఘంనేతలు పేర్కొన్నారు. గత కేబినెట్‌ మీటింగ్‌లో ఉద్యోగులకు కొత్తగా జీపీఎస్‌ తీసుకురావడం, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ ఏర్పాటు సహా ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా 60 రోజుల్లోగా పూర్తిగా అమల్లోకి రావాలని సీఎం జగన్ ఈ సందర్బంగా ఉద్యోగ సంఘాల నేతలతో పేర్కొన్నారు. ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, డైలీవేజ్‌ కేటగిరీ ఉద్యోగులను కూడా ఆప్కాస్‌ పరిధిలోకి తీసుకుని రావాలని ఆదేశించినట్లు వివరించారు.