Home Page SliderNational

హరియాణా గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ తరపున ఈ శుభాకాంక్షలందిస్తున్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, తెలంగాణా సంప్రదాయాల పట్ల ఆయన విజయదశమి సందర్భంగా నిర్వహించే అలయ్- బలయ్ కార్యక్రమం ఆయనకున్న మక్కువను తెలియజేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన పార్టీలకతీతంగా అందరినీ గౌరవిస్తారని కొనియాడారు. శ్రీ బండారు దత్తాత్రేయగారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీబండారు దత్తాత్రేయ తెలంగాణాలో బీజేపీ పార్టీకి చెందినవారు. ఎన్నో రాజకీయ పదవులు నిర్వహించారు. ప్రస్తుతం హరియాణా గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.