Home Page SliderNational

“గుంటూరు కారం” ఘాటుకు రికార్డులు బ్రేక్

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “గుంటూరు కారం”. కాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియోను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. అయితే ఈ గ్లింప్స్  వీడియో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కాగా ఈ గ్లింప్స్ వీడియో విడుదలైన 5 రోజుల్లోనే 28.46 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎక్కువ వ్యూస్ సాధించిన గ్లింప్స్ వీడియోగా ఇది రికార్డులను బ్రేక్ చేసింది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్‌ఖుష్ అవుతూ.. దీనిపై ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో తర్వాత పుష్ప-2 గ్లింప్స్ వీడియో 28.3 మిలియన్ వ్యూస్ సాధించి రెండవ స్థానంలో నిలిచింది. కాగా మూడో స్థానంలో భీమ్లా నాయక్ మూవీ గ్లింప్స్ వీడియో 26.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.