Home Page SliderNational

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న “గుంటూరు కారం”

సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న కొత్త సినిమా “గుంటూరు కారం”. కాగా ఈ సినిమా నుంచి మాస్ స్ట్రైక్ వీడియోను నిన్న  యూట్యూబ్‌లో చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. కాగా నిన్న  విడుదలైన ఈ వీడియో 16 గంటల్లోనే 17 మిలియన్ల వ్యూస్ సాధించింది. అంతేకాకుండా 3.11 లక్షల లైక్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్ నెం.1లో కొనసాగుతోంది. ఈ సినిమాలో మహేష్ స్టైల్,స్వాగ్,మాస్ లుక్స్‌తో అదరగొడుతున్నారు.ఇది చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ “గుంటూరు కారం” ఘాటు చూపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.