Andhra PradeshHome Page Slider

పేదలఇళ్ల కోసం సుప్రీం కోర్టు వరకూ న్యాయపోరాటం చేశాం

“పేదల కోసం న్యాయ పోరాటం చేశాం సుప్రీం కోర్టు వరకూ వెళ్లి  విజయం సాధించాం అంటూ ఏపీ సీఎం జగన్ అమరావతిలో జరిగిన ఏభైవేల ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు.  అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుంది అంటూ 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలం.. నా పేద అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం” అంటూ అభిమానుల కరతళధ్వనుల మధ్య చాటి చెప్పారు. సీఆర్డీఏ పరిధిలో మొత్తం 25 లేఅవుట్లలో, వారం పాటు ఇళ్ల పట్టాల పండు కార్యక్రమం ఉంటుందని, ఇళ్లు కట్టడానికి బీజం కూడా ఈ వారంలోనే పడుతుంది “అని సీఎం జగన్‌ ప్రకటించారు.

దివంగత మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జయంతి సందర్భంగా.. జులై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రకటించారు. ఈ 75 ఏళ్ల స్వతంత్య్ర భారత దేశంలో ఎన్నో పోరాటాలు చూసే ఉంటాం. కానీ ప్రభుత్వమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి సుప్రీం కోర్టు దాకా వెళ్లి మరి 50 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్న ఈ పండుగ, ఈ చారిత్రక ఘట్టాన్ని ఈ రోజు ఇక్కడ అమరావతిలోనే చూస్తున్నాం” అని హర్షం వ్యక్తం చేశారు.