తల, మెడ కొరికి ఏడేళ్ల బాలుడిని వెంటాడి చంపిన కుక్క
హనుమకొండ జిల్లాలోని ఖాజీపేటలోని కుక్కలు రెచ్చిపోయాయి. కుక్కలా క్రూరమృగాలా అన్నట్లు ప్రవర్తించింది ఓ కుక్క. అత్యంత దారుణంగా తల, మెడ కొరికి వెంటాడి మరీ ఏడేళ్ల పసిబిడ్డ చోటూని కొరికి చంపింది. తీవ్రంగా గాయపడిన బిడ్డను ఆసుపత్రికి తీసికెళ్లినా ఫలితం లేకపోయింది. గత కొన్నిరోజులుగా పసిబిడ్డలపై కుక్కల దాడులు మితిమీరిపోతున్నాయి. అంబర్ పేటలో సంఘటన మరువకముందే హైదరాబాదులో,ఖాజీపేటలో జరిగిన ఈ కుక్కల స్వైర విహారం, అందరినీ భయబ్రాంతులను చేస్తోంది. ఈ బాలుడు యూపీకి చెందిన వలసకూలీల బిడ్డగా గుర్తించారు.

ఆసుపత్రిలో చోటూ తల్లిదండ్రులను ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పరామర్శించారు. వారి రోదనలు ఆకాశాన్నంటాయి. పొట్టకూటి కోసం వలస వచ్చి, బిడ్డను కోల్పోయారు ఆ తల్లిదండ్రులు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఉంది. కుక్కల జనాభాను అరికట్టవలసిందే అని పౌరులు కోరుతున్నారు.