Home Page SliderNational

‘పొన్నియన్ సెల్వన్’ చిత్ర  నిర్మాణ సంస్థపై ఈడీ సోదాలు

సూపర్ హిట్ మూవీస్ తీసిన తమిళ చిత్ర నిర్మాణ సంస్థ లైకా పై ఈడీ దాడులు జరుగుతున్నాయి.. ఈ సంస్థపై మనీలాండరింగ్ కేసు నమోదవడంతో నేడు ఈ సంస్థ ఆఫీసులో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ నిర్మాణ సంస్థకు చెందిన 8 కార్యాలయాలలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ లైకా సంస్థ నుండి పొన్నియన్ సెల్వన్-1 మరియు 2 చిత్రాలు వచ్చాయి. గతంలో కత్తి, రోబో-2.0, దర్భార్ మొదలైన చిత్రాలను కూడా లైకా సంస్థ నిర్మించింది. ప్రస్తుతం నిర్మాణదశలో ఇండియన్ 2, లాల్ సలామ్ చిత్రాలు ఉన్నాయి. గతంలో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ పై కూడా మనీలాండరింగ్ అభియోగాలతో ఈడీ దాడులు నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.