డీకే శివకుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన షర్మిల
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన సోదరుడు డీకే శివకుమార్‌కు తన హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేశారు. “ఇటీవలే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత వచ్చిన ఈ పుట్టిన రోజు మీకు మరింత మధురమైనదిగా.. ముఖ్యమైనదిగా మారింది. కర్ణాటక ప్రజలకు సేవ చేసేందుకు మీకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో షర్మిల పార్టీ పొత్తు పెట్టుకుంటుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో షర్మిల ట్వీట్ ఆసక్తికరంగా మారింది.