కొత్త ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తాం..
గెలుపు, ఓటములు బీజేపీకి కొత్త కాదన్నారు బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల ఫలితాలతో పార్టీ శ్రేణులు ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికల్లో పరాజయంపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్నామని యడ్యూరప్ప ఈ సందర్భంగా తెలియజేశారు.

