Home Page SliderTelangana

గద్వాల్‌లో బాలుడి గాయాలకు ఫెవిక్విక్‌ అంటించిన వైద్యుని నిర్వాకం

గద్వాల్‌లోని ‘రైన్‌బో ‘హాస్పటల్‌లో గాయాలతో వచ్చిన బాలునికి తలకు కుట్లు వేయడానికి బదులు ఫెవిక్విక్ అతికించి పంపించాడు డాక్టర్. నొప్పితో బాలుడు అరవడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. దీనితో బాలుని తండ్రి ఆ డాక్టర్‌పై వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అయ్యింది. తాను డ్రస్సింగ్ చేయమని నర్సుకు చెప్పానని, ఏంజరిగిందో తనకు తెలియదంటూ వైద్యుడు బదులిచ్చాడు. మీరు మెడిసిన్ చేసిన డాక్టర్లేనా అంటూ తండ్రి మండిపడుతున్నారు. తనను లోనికి రానివ్వకుండా ట్రీట్‌మెంట్ పేరుతో ఫెవిక్విక్ అంటించారని, తనకు చాలా పలుకుబడి ఉందని, ఎంతదూరమైనా వెళ్తానని కేకలు వేసారు. తన కొడుకు కళ్లు పోతే జవాబుదారీ ఎవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more: తెలంగాణాలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..?