క్లారిటీ వచ్చే వరకు మళ్లీ మళ్లీ భేటీలు…! పవన్-బాబు భేటీపై నాదెండ్ల
ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు-పవన్ కల్యాణ్ చర్చలు జరపాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన పనిచేస్తోందన్నారు. నిన్న చంద్రబాబు నివాసానికి వెళ్లి పవన్ కల్యాణ్ ఏపీలో వచ్చే రోజుల్లో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత గురించి మనోహర్ వివరించారు. ఇద్దరు నేతలు ఏపీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు ఆయన చెప్పారు. రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామన్నారు మనోహర్. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఏం చేయాలి? వచ్చే రోజుల్లో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ మరిన్ని చర్చలు జరుపుతారని చెప్పారు. గతంలో చర్చల తర్వాత మీడియాకు విషయాలు వెల్లడించే పవన్-చంద్రబాబు ఈసారి ఎలాంటి వివరాలను బయటకు వెళ్లడించలేదు.
