Home Page SliderTelangana

బీఆర్‌ఎస్ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ ప్రతినిధుల సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలంటూ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాగ్రత్తగా ఉండకపోతే మీకే ఇబ్బందని, నేనేమీ చేయలేనని పేర్కొన్నారు. బాగా పని చేస్తేనే టిక్కెట్లు ఇస్తానని తేల్చి చెప్పారు.  ఈ సంవత్సరం చివరికి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. ఎవరైతే ప్రజల్లో ఉంటారో వారికే తిరిగి అవకాశం ఉంటుందన్నారు. పార్టీ గెలుపుకు ప్రతీ కార్యకర్త, ఎమ్మెల్యేలు బాగా పనులు చేసుకోవాలని, మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ సభలో 250 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయరాజకీయాలలో కూడా బీఆర్‌ఎస్ కార్యకలాపాల గురించి మధ్యాహ్న విరామానంతరం చర్చించే అవకాశాలున్నాయి.