Home Page SliderTelangana

గుర్రాన్ని కాపాడబోయి ఇద్దరు యువకుల మృతి

హైదరాబాదులోని రాజేంద్రనగర్ హార్స్ రైడింగ్ సెంటర్‌లో విషాదం చోటుచేసుకుంది. గుర్రాన్ని నడుపుతున్న ఇద్దరు యువకులు దాన్ని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ రాజస్థాన్‌కు చెందిన అసు సింగ్, సైఫ్‌లుగా గుర్తించారు. గుర్రం నీరు తాగేందుకు ‘ఇసారివర్‌’లో నీరు త్రాగేందుకు వెళ్లబోయింది. గుర్రంపై ఆసమయంలో అసు సింగ్ కూర్చొని ఉన్నారని తెలుస్తోంది. గుర్రం నీటిలోపలికి వెళ్లడంతో సైఫ్ కంగారు పడి గుర్రాన్ని, అసు సింగ్‌ను కాపాడడానికి ప్రయత్నించాడని సమాచారం. ఈ ‘ఇసారివర్’ మూసీనది పాయ అనీ, హిమాయత్ సాగర్‌లోని నీరు ఇందులో కలుస్తుంటుందని అక్కడివారు తెలియజేశారు. ఈ రివర్ చాలా లోతుగా ఉంటుందని, అక్కడి మట్టి బురదగా, పాకుడుగా ఉంటుందని తెలియజేశారు. ఇది ఊబి వంటిదని తెలిపారు. దీనితో వారు ఈ ప్రదేశంలో కూరుకుపోయారు. అసిఫ్ అనే వ్యక్తి వీరిని చూసి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరి మృతదేహాలను బయటికి తీసి, ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.