Home Page SliderNational

ఢిల్లీ ప్రజలకు గుడ్ న్యూస్, ఫ్రీ పవర్ బిల్లుకు ఆమోదం

ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా మధ్య ఫ్రీ పవర్ బిల్లు ఆమోదం విషయంలో ముగిసింది. దేశ రాజధానిలో దాదాపు 46 లక్షల మందికి విద్యుత్ రాయితీని అందించే బిల్లు ఫైళ్లపై గవర్నర్ సంతకం చేశారు. ఉచిత విద్యుత్ బిల్లుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలపనుందను, శుక్రవారం నుండి సబ్సిడీలను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి అతిషి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. 46 లక్షల మందికి ఇస్తున్న సబ్సిడీ విద్యుత్ నేటి నుంచి ఆగిపోతుందని, సోమవారం నుంచి ప్రజలకు సబ్సిడీ లేకుండా పెంచిన బిల్లులు అందుతాయని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి అతీషి వివరించారు. కీలకమైన ఫైళ్లను ఎల్జే తొక్కిపెట్టారంటూ ఆమె విమర్శించారు. వచ్చే ఏడాది కూడా సబ్సిడీని కొనసాగించేందుకు ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించిన, ఎల్జే తీరు బాధాకరమని చెప్పారు.

ఐతే ఆప్ ఆరోపణలు అసత్యాలని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం విమర్శలు గుప్పించింది. అనవసర రాజకీయాలు మానుకోవాలని అతిషికి సూచించింది. ఏప్రిల్ 4 వరకు నిర్ణయాన్ని ఎందుకు పెండింగ్‌లో ఉంచారని, ఏప్రిల్ 15 వరకు గడువు ముగియడంతో పాటు ఏప్రిల్ 11న మాత్రమే ఫైల్‌ను ఎందుకు పంపారని ప్రశ్నించింది. ఎల్జీపై అనవసర రాజకీయాలు, నిరాధారమైన, అసత్య ఆరోపణలు మానుకోవాలని విద్యుత్ మంత్రికి ఎల్జే కార్యాలయం హితవు పలికింది. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానాలని, ఏప్రిల్ 13న డ్రామా ఆడాల్సిన అవసరం ఏముందని దుయ్యబట్టింది.

విద్యుత్ సబ్సిడీ గురించి చర్చించడానికి సక్సేనాతో ఐదు నిమిషాల అపాయింట్‌మెంట్ కోరానని, 24 గంటలు గడిచినా పైగా స్పందన రాలేదని అతిషి అంతకు ముందు విమర్శించారు. సబ్సిడీకి సంబంధించిన బడ్జెట్‌ను విధానసభ ఆమోదించిందని, ప్రభుత్వం వద్ద సబ్సిడీకి డబ్బు ఉంది కానీ మేము దానిని ఖర్చు చేయలేమని ఆమె అన్నారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం 200 యూనిట్ల నెలవారీ వినియోగంతో వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. 201 నుండి 400 యూనిట్లు వినియోగించే వారికి 50 శాతం సబ్సిడీతో 850 రూపాయలు బిల్లు చెల్లిస్తే సరిపోయేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకొంది.

విద్యుత్ రాయితీ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ ఇస్తామని గత ఏడాది కేజ్రీవాల్ ప్రకటించారు. అధికారిక లెక్కల ప్రకారం, 58 లక్షలకు పైగా గృహ వినియోగదారులలో 48 లక్షల మంది విద్యుత్ సబ్సిడీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆప్ ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌లో విద్యుత్ సబ్సిడీ కోసం ₹ 3,250 కోట్లు కేటాయించింది.