మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై కేసు నమోదు
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉండి స్టేషన్‌కు విచారణకు రావాల్సిందిగా కోరారు. ఆక్వా రైతు పోరుబాటలో పాల్గొన్నందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది నవంబర్‌లో ఉండిలో టీడీపీ ఆధ్వర్యంలో ఆక్వా రైతు పోరు బాటలో ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసులు నమోదు చేయడంపై మాజీ మంత్రి ప్రత్తిపాటి షాక్‌కు గురయ్యారు. గత ఏడాది నవంబర్ 14న పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టీడీపీ నిర్వహించిన ఆక్వా రైతుల పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్నందుకే నతపై కేసులు నమోదు చేశారని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పుల్లారావు నివాసం వద్దకు వచ్చి పోలీసులు నోటీసులు అందించారన్నారు. పుల్లారావుకు 41(a) సీఆర్పీసీ చట్టం కింద ఉండి పోలీసులు నోటీసులు అందించారు. తాము పిలిచినప్పుడు విచారణ అధికారి ముందు హాజరు కావాలని సూచించారు.
ఆక్వా రైతులను ఆదుకునేందుకు తాను పోరు బాట చేపడితే సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం దాన్ని తీవ్రమైన నేరంగా భావించి కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు పుల్లారావు. ప్రభుత్వ నిరంకుశ, నియంతృత్వ ధోరణికి ఇది ఇది నిదర్శనమన్నారు. ప్రజలకు మంచినీళ్లు ఇవ్వమని అడిగిన నేరానికి గతంలో స్థానిక మంత్రి దళిత అధికారిని అడ్డుపెట్టి తనపై అట్రాసిటీ కేసు పెట్టించారన్నారు. ఇప్పుడు రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మరో కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి కేసులకు, నోటీసులకు, భజంత్రీగాళ్లకు తాను భయపడలేదన్నారు. ప్రజల కోసం రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందన్నారు.

