Home Page SliderNational

‘లక్ష’మందితో వందేమాతర గీతం

ఒకేసారి లక్షమంది ‘వందేమాతరం’ ఆలపిస్తే ఎలా ఉంటుందో చూడాలంటే, గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ఆరంభ గీతం చూడాల్సిందే. ప్రతీ భారతీయుడి హృదయం పులకరించే ఈ అద్భుత దృశ్యం నిన్న ఆవిష్కృతమయ్యింది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఐన నరేంద్రమోదీ స్టేడియంలో మ్యాచ్ ఆరంభంలో రెహమాన్ ఆలపించిన ‘మాతుఝే సలామ్’ అనే పాటను వినిపించారు. దీనితో అక్కడి ప్రేక్షకులందరూ గొంతు కలిపి వందేమాతరం అంటూ ఆలాపించారు. వారు దేశభక్తితో పాడిన ఈ పాట చూస్తే అత్యద్భుతం అనిపించక మానదు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. వందేమాతరం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.