ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ కోర్టు..
మామూలుగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద మొక్కలు నాటాడం.. వాహనాల పార్కింగ్ కొరకు ఉపయోగించడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే.. నవీ ముంబయిలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి.. ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఖాళీ స్థలంలో బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ కోర్టులు, వాటితోపాటు చిన్న పిల్లలు ఆడే ఆట వస్తువులను కూడా ఏర్పాటు చేశారు. దీనిపై నగర ప్రజల నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ ఆలోచన బాగుందంటూ మంత్రి కేటీఆర్ సైతం ఆ వీడియోను షేర్ చేశారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ట్యాగ్ చేశారు.

