డ్యాన్స్ చేస్తూ… ప్రభుత్వ ఉద్యోగి మృతి
‘బస్ ఆజ్ కి రాత్ హై జిందగీ’ అనే పాటలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్న వాళ్లు హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో చోటు చేసుకుంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా సురేంద్రకుమార్ దీక్షిత్ అనే వ్యక్తి డ్యాన్స్ చేస్తూ మరణించాడు. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా సెలబ్రెటీలు, సామాన్యులు సైతం హఠాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారు. ఆడుతూ పాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అతను డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.