Home Page SliderTelangana

కెనడాలో నిజామాబాద్ వైద్య విద్యార్థిని గుండెపోటుతో మృతి

ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన వైద్య విద్యార్థిని అనూహ్యంగా మృతి చెందింది. నిజామాబాద్‌కు చెందిన పూజితా రెడ్డి గుండెపోటుతో చనిపోయింది. ఖమ్మం జిల్లాలో బీడీఎస్ పూర్తి చేసిన పూజిత, పీజీ చేసేందుకు ఈ ఏడాది జనవరి 26న కెనడా వెళ్లింది. స్నేహితులతో కలిసి హాస్టల్ ఉంటున్న పూజిత.. పది రోజుల క్రితం హాస్టల్లో మాసివ్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యింది. స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించినా… చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థిని సోదరుడు మృతదేహాన్ని స్వస్థలం తీసుకొచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు కెనడా వెళ్లిన బిడ్డ.. శవమై తిరిగి రావడంతో.. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మల్కాపూర్ గ్రామ ఉపసర్పంచి వెంకట్ రెడ్డికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు అరుణ్ రెడ్డి కెనడాలోనే ఉంటున్నాడు. చెల్లెలు ఉన్నత విద్య చదివితే బాగుంటుందని భావించి కెనడా పిలిపించుకుంటే… ఇలా జరగడంతో.. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.