Home Page SliderNational

మహిళా దినోత్సవానికి ముంబై మెట్రో కీలక నిర్ణయం

త్వరలో మహిళా దినోత్సవం రాబోతున్న కారణంగా రెండు మెట్రో స్టేషన్లలో నిర్వహణ బాధ్యతను ముంబై మెట్రో మొత్తం మహిళా సిబ్బందికి అప్పగించింది. అవి అకుర్లి, ఎక్సాస్ మెట్రో స్టేషన్లు. రవాణా రంగంలో మహిళా సాధికారత కొరకే ఇలా చేసినట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు. ఇది తాత్కాలికం కాదని, ఇకపై శాశ్వతంగా ఈ స్టేషన్ల బాధ్యత మహిళా ఉద్యోగులదే అని, భవిష్యత్తులో కూడా మహిళలకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ రెండు స్టేషన్లలో మొత్తం 76 మంది  సెక్యూరిటీ, టికెటింగ్, స్టేషన్ మేనేజర్లు అందరూ కూడా మహిళలే. వీరికి షిఫ్టు డ్యూటీ ఉంటుంది. ఈ స్టేషన్లు గత జనవరి నుండే అందుబాటులోకి వచ్చాయి..