Home Page SliderNational

ఆస్ట్రేలియాతో భారత్ మూడో టెస్టులో అద్భుతం జరిగేనా?

భారతదేశం vs ఆస్ట్రేలియా మూడో టెస్ట్
డే 1: సత్తా చాటిన రవీంద్ర జడేజా
ఆస్ట్రేలియా 156/4, 109 పరుగులకే భారత్ ఆలౌట్

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సీరిస్‌లో మూడో టెస్టులో భారత్ చతికిలపడింది. వరుస విజయాలతో జోరు మీదున్న భారత ఆటగాళ్లు మూడో టెస్టులో చేతులెత్తేశారు. కేవలం 109 పరుగులకే ఇండియా ఆలౌట్ అయ్యింది. ఇక తొలుత భారీ స్కోరు దిశగా దుసుకెళ్తుందనుకున్న ఆస్ట్రేలియా సైతం ఒక్కో వికెట్ కోల్పోతూ… 154 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (7), కామెరాన్ గ్రీన్ (6) క్రీజులో నిలిచారు. స్టంప్స్ వద్ద, సందర్శకులు ఇండియాపై 47 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. ఐతే రెండో రోజు అద్భుతం జరిగితే టీమ్ ఇండియా పై చేయి సాధించే అవకాశం ఉంది.

భారత్ తరఫున రవీంద్ర జడేజా… స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, ట్రావిస్ హెడ్‌లను అవుట్ చేశాడు. అంతకుముందు, మాథ్యూ కుహ్నెమాన్ టెస్ట్ క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆస్ట్రేలియా, ఇండియాను 109 పరుగులకు కట్టడి చేసింది. ఆతిథ్య జట్టులో విరాట్ కోహ్లీ (22 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గైర్హాజరీలో ఆస్ట్రేలియాను స్టీవ్ స్మిత్ నడిపిస్తున్నాడు.