Home Page SliderNews AlertTelangana

రోడ్డు ప్రమాదంలో ఇంటలిజెన్స్‌ కానిస్టేబుల్‌ మృతి

చందానగర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఇంటలిజన్స్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. బైక్‌పై డ్యూటీకి వెళ్తుండగా .. వెనుక నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కానిస్టేబుల్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతున్ని 2014 బ్యాచ్‌కు చెందిన ఇంటలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ముఫిద్‌గా గుర్తించారు. అతను సైబరాబాద్‌ సీపీ ఆఫీసులో అసిస్టెంట్‌ ఎనలటికల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతి వేగంతో బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. అతనిపై కేసు నమోదు చేశారు.