Home Page SliderNews AlertTelangana

మన తెలుగు పాటకు దక్కిన అద్భుతమైన గౌరవం

తెలుగు సంగీత కీర్తి పతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడిస్తూ, ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ దక్కించుకోవడం పట్ల చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, చిత్ర దర్శకుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్, జూనియన్ ఎన్టీఆర్ తోపాటుగా యావత్ చిత్ర యూనిట్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డు భారతీయ సంగీతానికి, మరీ ప్రత్యేకంగా మన తెలుగు పాటకు దక్కిన అద్భుతమైన గౌరవమన్నారు.  తెలుగు చిత్రాలు ఇప్పటికే అంతర్జాతీయంగా బాక్సాఫీస్ కలెక్షన్లలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకుంటున్న సందర్భంలో మన పాటకు కూడా అంతర్జాతీయ గౌరవ దక్కడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మన సంగీతం (మ్యూజిక్), మన నృత్యం (కొరియోగ్రఫీ), మన దర్శకత్వం (డైరెక్షన్), మన చిత్రాలు అంతర్జాతీయంగా మరింత గుర్తింపును అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కిషన్‌ రెడ్డి అన్నారు.