హజ్ యాత్రికులపై ఆంక్షలు ఎత్తివేత
హజ్ యాత్రికులకు సౌదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రపై సౌదీ అరేబియా ఆంక్షలు ఎత్తివేసింది. హజ్ యాత్రకు ప్రతి ఏటా కోట్ల మంది జనాలు తరలి వస్తారు. అయితే.. కరోనా కారణంగా సౌదీ ప్రభుత్వం గత మూడేండ్లుగా కొన్ని ఆంక్షలు పెట్టింది. వాటిని తొలగిస్తూ సౌదీ మంత్రి డా. తౌఫిక్ అల్ రబియా ట్విట్టర్లో ప్రకటించారు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా హజ్ యాత్రికుల సంఖ్యను 10 లక్షలకు తగ్గించింది. అంతేకాకుండా వయో పరిమితి విధిస్తూ … 18 నుంచి 65 ఏండ్ల వయసు కలిగిన వాళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. వాళ్లు తప్పనిసరిగా కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకుంటూనే అనుమతిస్తామని తెలిపింది. అయితే.. హజ్ ఎక్స్ పో 2023 ప్రారంభం కానుండగా.. ఇప్పుడు ఆ ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

