ఢిల్లీ అలర్ట్.. పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గత కొద్ది రోజుల నుండి వాయు కాలుష్యం అక్కడి ప్రజలకు భయాందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 419కి చేరింది. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. BS-III పెట్రోల్, BS-IV డీజిల్ ఫోర్ – వీలర్లపై తాత్కాలిక నిషేధం ప్రకటించింది. ఇది శుక్రవారం వరకు వర్తిస్తుందని తెలిపింది. ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం.. 1988 సెక్షన్ 194(1) ప్రకారం 20,000 జరిమానా విధించబడుతుందని పేర్కొంది.

