Home Page SliderNews AlertTelangana

కాంగ్రెస్‌ ధర్నాకు లైన్‌ క్లియర్‌

సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్‌ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ధర్నాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ధర్నాలో 300 మందికి మించి ఉండకూడదని హైకోర్టు తెలిపింది. ధర్నాలో ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని పేర్కొంది. మళ్లీ సభ ఎప్పుడు నిర్వహిస్తున్నారో పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోర్టు సూచించింది.  సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాకు దిగింది. అయితే.. పోలీసులు కాంగ్రెస్‌ ధర్నాకు అడ్డుకున్నారు. ధర్నాకు పర్మిషన్‌ లేదంటూ రేవంత్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై రేవంత్‌ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌ ధర్నాకు పర్మిషన్‌ కోసం ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ధర్నాకు అనుమతినిచ్చింది.