కుప్పంలో టెన్షన్.. టెన్షన్..
టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటపనై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటించనున్నారు. వివిధ వర్గాలతో ఆయన సమావేశం కానున్నారు. రోడ్ షోలు నిర్వహించనున్నారు. కానీ పోలీసులు మాత్రం వీటికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేశారు. దీంతో కుప్పంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం కుప్పంలో ఉధ్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులపై టీడీపీ తమ్ముళ్లు దాడికి దిగారు. వారిని చుట్టుముట్టి పిడిగుద్దులు గుద్దారు. అడ్డుకునేందుకు పెట్టిన బారీకేడ్లను తీసి అవతల పడేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పోలీసులు, ప్రభుత్వం తీరుపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. ప్రభుత్వం కుట్రలు చేసినా.. చంద్రబాబు పర్యటన తగ్గేదేలే అనే రేంజ్‌లో ఆందోళన చేపట్టారు.



 
							 
							