లీటరు పాలపై రూ.2 పెంచిన మదర్ డైయిరీ
మరోసారి మదర్ డైయిరీ పాల ధరను పెంచాయి. మదర్ డైయిరీ సంస్థ లీటరు పాలపై 2 రూపాయలు పెంచింది. మంగళవారం నుంచి ఢిల్లీ మార్కెట్‌లో కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. ఈ ఏడాది అయిదోసారి మదర్ డైయిరీ సంస్థ పాల ధరలను పెంచింది. ఢిల్లీ నగరంలో రోజుకు సుమారు 30 లక్షల లీటర్ల పాలను సరఫరా చేస్తున్నారు. మదర్ డైయిరీ ఫుల్ క్రీమ్ లీటరు పాలు రూ. 66కు అమ్మనున్నారు. టోన్డ్ మిల్క్ ధర ఇప్పుడు రూ. 53కు రానున్నది. ఆవు పాలు మరియు టోకెన్ పాల ధరపై ఎలాంటి మార్పు ఉండదని మదర్ డైయిరీ సంస్థ తెలిపింది.