బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం
గుజరాత్ గ్యాంగ్ రేప్ బాధితురాలు బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గోద్రా అల్లర్ల సమయంలో తనపై గ్యాం రేప్ చేసిన నిందితుల విడుదలను సవాల్ చేస్తూ.. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 2002లో గోద్రా ఘటన అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపైనా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. అత్యాచార కేసులో 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం సత్ప్రవర్తన కింది రిలీజ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది.

