Home Page SliderNews Alert

థాంక్యూ గుజరాత్… ప్రధాని మోదీ ట్వీట్

రాష్ట్రంలో పార్టీ రికార్డు బద్దలు కొట్టిన తర్వాత ఈరోజు గుజరాత్‌కు ధన్యవాదాలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. చాలా భావోద్వేగాలను అధిగమించానన్నారు. ప్రజలు అభివృద్ధి రాజకీయాలను ఆశీర్వదించారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు కొనసాగుతున్న అభివృద్ధి కొనసాగాలని కోరుకున్నారన్నారు. ప్రజలు రాష్ట్ర బాగు కోరుకున్నారన్నారు. గుజరాత్ జనశక్తికి నమస్కరిస్తున్నానంటూ మోడీ ట్వీట్ చేశారు.కష్టపడి పనిచేసిన కార్యకర్తలు మోదీ ధన్యవాదులు చెప్పారు. ప్రతి ఒక్కరు ఛాంపియన్ అన్నారు. పార్టీకి నిజమైన బలం కార్యకర్తల అసాధారణమైన కృషి అన్నారు. వారు లేకుండా ఈ చారిత్రాత్మక విజయం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు “ఆప్యాయత, మద్దతు” కు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చడానికి, ప్రజల సమస్యలను లేవనెత్తడానికి పని చేస్తూనే ఉంటామన్నారు.