నిజాం కాలేజీ విద్యార్థులతో చర్చలు సఫలం
తెలంగాణ విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డితో నిజాం కాలేజీ విద్యార్థుల చర్చలు సఫలం అయ్యాయి. ఓయూ వీసి, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌పై మంత్రి సీరియస్ అయ్యారు. అప్లై చేసుకున్న విద్యార్థులు అందరికీ హాస్టల్ కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల ప్రకారం విద్యార్థులతో కాలేజీ ప్రిన్సిపాల్ సమావేశమయ్యారు.
యూజీ 2, 3 విద్యార్థులు హాస్టల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సర్క్యూలర్ జారీ చేశారు. యూజీ విద్యార్థులకు హాస్టల్ కేటాయించిన తర్వాత మిగిలితే పీజీ వాళ్ళకు కేటాయించాలని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. అయితే.. హాస్టల్ గదుల కోసం యూజీ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

