NewsTelangana

ఆ 12 మంది రాజీనామా చేయాలి.. ఉప ఎన్నికను ఎదుర్కోవాలి

మునుగోడులో టీఆర్‌ఎస్‌ కౌరవులతో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పెద్ద యుద్ధమే చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నో బెదిరింపులకు పాల్పడిందని.. అయినా ఆ పార్టీకి చుక్కలు చూపించామని చెప్పారు. తమ పార్టీలో చేరాలంటే పదవికి రాజీనామా చేసి ప్రజా విశ్వాసాన్ని చూరగొనాలని.. కేసీఆర్‌ 12 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోకి ఏ ప్రాతిపదికన చేర్చుకొని పదవులు కట్టబెట్టారని నిలదీశారు. దమ్ముంటే ఆ 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ప్రజా విశ్వాసం చూరగొనాలని సవాల్‌ విసిరారు. మునుగోడులో తాము సాధించిన ఓట్లతో సంతృప్తిగా ఉన్నామని.. సొంత బలం లేని టీఆర్‌ఎస్‌ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి గెలవడమూ ఓ గెలుపేనా..? అని ప్రశ్నించారు.