NationalNews

బాణా సంచా వద్దు.. స్వీట్స్ ముద్దు… సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

బాణసంచా నిషేధంపై సుప్రీంకోర్టు ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అందరం స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందామన్న కోర్టు… ఆ డబ్బుతో స్వీట్లను కొనుగోలు చేసుకోవాలంది. బాణాసంచాపై నిషేధాన్ని ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏటేటా బాణాసంచా కాల్చడాన్ని తగ్గించాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయ్. పెరిగిపోతున్న కాలుష్యం దెబ్బకు.. నిబంధనలను కఠినంగా పాటించాలంటూ ప్రభుత్వాలతోపాటు, వివిధ వర్గాల నుంచి వస్తూనే ఉన్నాయ్. తాజాగా ఢిల్లీలో బాణసంచా కాల్చినా, కొన్నా జరిమానా, జైలు శిక్ష విధిస్తామని కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఐతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు బాణాసంచా వ్యాపారుదారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ కేసును ఇప్పటికిప్పుడు విచారించాల్సిన అవసలేదంది. ప్రజలను స్వచ్ఛమైన గాలి పీల్చుకోనివ్వాలంది. బాణసంచా మీద వెచ్చించే ఖర్చుతో మిఠాయిలు కనుక్కోవాలని పేర్కొంది.