దంపతుల మధ్య నచ్చజెప్పిన వ్యక్తి హత్య
భోపాల్: మనసర్కార్
మటన్ విషయంలో భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ అన్యాయంగా మధ్యవర్తి ప్రాణం తీసింది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు మామూలే. అయితే దంపతుల మధ్య తగాదాలోకి వెళ్లకూడదంటారు పెద్దలు. మధ్యప్రదేశ్లోని బిల్లు అనే వ్యక్తి ఇలా వారికి సర్ది చెప్పబోయి ఏకంగా హత్యకు గురయ్యాడు.
మధ్యప్రదేశ్లోని భోపాల్లో పప్పు అనే వ్యక్తి మొన్న మంగళవారం రోజు మటన్ కూర వండాలని భార్యను అడిగాడు. అయితే ఈరోజు మాంసం వద్దని, మంగళవారం తినకూడదని వాదించింది భార్య. ఈ వివాదంలో గొడవ ఎక్కువయ్యింది. ఇది గమనించిన బిల్లు అనే పొరుగింటి వ్యక్తి వారిద్దరికీ నచ్చచెప్పాడు. తర్వాత తన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే కోపం పట్టలేని పప్పు అతని ఇంటికి వెళ్లి మామధ్యలోకే వస్తావా అంటూ అతనిని తీవ్రంగా కొట్టాడు. దానితో దెబ్బలు తట్టుకోలేక బిల్లు ప్రాణాలు కోల్పోయాడు. పప్పు భార్య వాంగ్మూలం ప్రకారం ఆమె భర్త పప్పును పోలీసులు అరెస్టు చేశారు.

