నేడు హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా వివిధ ప్రాజేక్టులకు శంకుస్ధాపనలు చేస్తారు. ఉనా హిమాచల్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్లీ వరకు ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది. దేశంలో ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లలో ఇది నాలుగోది.

దీని తరువాత, ఒక ఐఐఐటీ ఉనాను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. ఉనాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత చంబాలో జరిగే బహిరంగ సభలో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)-IIIని ప్రధాని ప్రారంభిస్తారు. డిసెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

