బండి వర్సెస్ కేటీఆర్.. మాటల మంటలు
మునుగోడు ఉపఎన్నికకు కౌంట్ డౌన్ మొదలవుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయ్. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించారు మంత్రి కేటీఆర్… కేసీఆర్ ఫౌంహౌజ్‌లో సకుటుంబ సపరివార సమేతంగా తాంత్రిక పూజలు చేశారంటూ సంజయ్ విమర్శించగా… అందుకు తీవ్రంగా స్పందించారు కేటీఆర్. ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు.. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో… మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడంటూ కామెంట్ చేశారు. ఎర్రగడ్డలో బెడ్ తయారుగా ఉందని.. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించాలని ట్విట్టర్లో ఘాటు రిప్లై ఇచ్చారు. అయితే కేసీఆర్.. కుటుంబ సభ్యులతో కలిసి ఫామ హౌజ్‌లో తాంత్రిక పూజలు చేసి, ఆ తర్వాత వాటిని కాళేశ్వరం నీళ్లలో కలిపేందుకు వెళ్లాడని.. పైకి మాత్రం ప్రాజెక్టు పరిశీలినంటూ చెప్పుకొచ్చారంటూ విమర్శించారు. కేసీఆర్ కార్యక్రమం వేరు.. బయటకు చెప్పేది వారన్నారు. పూజలన్నీ చేశాకే… స్వార్థం కోసం, కుటుంబం కోసం తాంత్రికుడి సూచనలతో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాడన్నారు.

