NationalNews

అబార్షన్‌, వైవాహిక అత్యాచారంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

మహిళలందరూ సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్ ప్రక్రియకు అర్హులు ఈ విషయంలో ఎలాంటి అంశానికి తావులేదని తేల్చి చెప్పింది సుప్రీం కోర్టు. వివాహిత, అవివాహిత మహిళ మధ్య ఏదైనా తేడా చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ఈ రోజు తీర్పునిచ్చింది. వైవాహిక అత్యాచార, అబార్షన్ అంశాలపై కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం, రేప్ నిర్వచనంలో వైవాహిక అత్యాచారం తప్పనిసరిగా ఉంటుందని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. వివాహం తర్వాత జరుగుతున్న అత్యాచారాలు చట్ట విరుద్ధమని పేర్కొంది. అబార్షన్ హక్కు కాదనడానికి మహిళ వైవాహిక స్థితి ఒక కారణం కాదని కోర్టు తీర్పు చెప్పింది. అబార్షన్ చేయించుకోడానికి… వివాహం చేసుకున్నవారు, చేసుకోని వారు అన్న తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధమంది కోర్టు. పెళ్లి అయినా కాకున్నా… 24 వారాల వరకు అబార్షన్ చేయించుకోవచ్చని కోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చింది. బలవంతంగా అబార్షన్ చేయించడంపై మహిళలను కాపాడాలంది.