Telangana

బతుకమ్మ ఉత్సవాలు 25 నుంచి

ప్రకృతిని పూజించి సమూన్నమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు చిరునామాగా నిలిచే బతుకమ్మ పండుగను ఈనెల 25 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ మూడున సద్దుల బతుకమ్మ నిర్వహణకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకు ఇప్పటికే తెలంగాణ సమాజం సిద్దమైంది. బతుకమ్మ ఉత్సవాలు మొత్తం 9 రోజుల పాటు జరుగుతాయి. హైదరాబాద్‌లోని బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పండుగ నిర్వహిస్తారు.