InternationalNews

పాక్ పరువు తీసిన ఆ దేశ ప్రధాని షబాజ్ షరీఫ్

ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమైనప్పుడు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హెడ్‌ఫోన్‌ను పెట్టుకోవడానికి చాలా చాలా ఇబ్బందిపడ్డారు. మొత్తం ఘటన వీడియో చూస్తే ఎవరైనా సరే నవ్వు ఆపుకోలేరు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 22వ శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సమర్‌కండ్‌లో చర్చల సమయంలో షరీఫ్ చెవి నుండి ఇయర్ బడ్స్ పడిపోవడంతో ఆయన కొంత ఇబ్బందిపడ్డాడు. మొదటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి హెడ్‌ఫోన్‌ను సరిచేయడానికి కొంత సమయం తీసుకున్నా… చర్చలు ప్రారంభమయ్యే వరకు పుతిన్ వేచి ఉన్నందున సహాయం చేయమని ఒక అధికారిని అడిగాడు. కానీ సమావేశాన్ని ప్రారంభించబోతున్నప్పుడు అదే ఇయర్ ఫోన్… చెవిలోంచి కింద పడిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ నవ్వు ఆపుకోలేకపోయాడు.


మొత్తం ఘటన పాకిస్తాన్‌లో సంచలనం రేపుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కార్యకర్తలు… షరీఫ్‌ను సోషల్ మీడియాలో దుమ్మరేపేస్తున్నారు. ఈ ఘటన దేశానికి అవమానకరమంటూ ట్విట్టర్‌‌లో విమర్శల మోతమోగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలోని ప్రొవిన్షియల్ చీఫ్‌లలో ఒకరు సమ్మిట్ నుండి మరొక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. షరీఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని బిచ్చగాళ్లలా పనిలేకుండా కూర్చుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఐతే సమర్‌కండ్‌లో తొలి రోజు చర్చలు ఫలప్రదమయ్యాయని షరీఫ్ చేసిన పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ, పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకరు ఆసక్తిగా రాసుకుంటూ కన్పిస్తుంటే మరొకరు పనిలేకుండా బిచ్చగాళ్లలా కూర్చున్నారంటూ ట్వీట్ చేయడం విశేషం.

పాకిస్తాన్ ప్రతినిధి బృందంలో షరీఫ్‌తో పాటు విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారీ, ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఉన్నారు. కోవిడ్ భయాందోళనలను దూరం చేస్తూ రెండేళ్లలో SCO మొదటి వ్యక్తిగత శిఖరాగ్ర సమావేశం ఉజ్బెకిస్తాన్ సమర్‌కండ్‌లో జరుగుతోంది. ఇండియాతోపాటు ఎనిమిది దేశాలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నాయ్. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సమర్‌కండ్ చేరుకున్నారు. పాకిస్తాన్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు మేరకు రష్యా గ్యాస్ సరఫరా చేస్తోందని షరీఫ్‌‌కు పుతిన్ భరోసా ఇచ్చారు.