బాహుబలి ఇంటికి రాజ్‌నాథ్ సింగ్
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్‌ను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బేంగంపేట విమానాశ్రయం చేరుకోనున్న రాజ్‌నాథ్ సింగ్ 2 గంటల 40 నిమిషాలకు జూబ్లీహిల్స్‌లోని కృష్ణం రాజు నివాసానికి వెళ్తారు. రెబల్ స్టార్ కుటుంబాన్ని పరామర్శించి.. మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్‌నగర్‌లో జరిగే కృష్ణం రాజు సంస్మరణ సభలోనూ కేంద్ర రక్షణ మంత్రి పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ఢిల్లీ వెళ్లిపోతారు. అమిత్ షా కూడా ప్రభాస్‌ను, కృష్ణం రాజు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన కృష్ణం రాజు కేంద్ర విదేశాంగ, రక్షణ శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రభాస్‌కు కృష్ణం రాజు పెదనాన్న.

