కేఏ పాల్‌కు ఎన్నికల సంఘం షాక్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. సంస్కరణల్లో భాగంగా దేశవ్యాప్తంగా క్రియాశీలంగా లేని పార్టీల జాబితాలో ప్రజాశాంతి పార్టీని చేర్చింది. కేఏ పాల్‌తో మరో 253 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉనికిలో లేని 86 పార్టీలను గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. తాజా నిర్ణయంతో ఎన్నికల నియమావళిని పాటించడంలో విఫలమైన మొత్త పార్టీల సంఖ్య 537కి చేరుకుంది.
ఇందులో తెలంగాణ నుంచి రిజిస్టర్ అయిన 20 పార్టీలు కూడా ఉన్నట్టు నిన్న తెలిపింది.
1. ఆల్ ఇండియా మహిళా డెమొక్రటిక్ ఫ్రంట్, 2. భారతీయ యువత, సమత, రా ష్ట్రీయత కాంగ్రెస్ పార్టీ, 3. నవ తెలంగాణ పార్టీ, 4. ప్రజా చైతన్య పార్టీ, 5. త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీ, 6 అఖండ్ భారత్ నేషనల్ పార్టీ, 7. అఖిలాంధ్ర మహాదేశం,8. ఆలిండియా ముక్తిదళ్ పార్టీ, 9. ఆలిండియా ముత్తహిద్ క్యుయామి మహాజ్, 10. ఆంధ్రప్రదేశ్ నవోదయ ప్రజాపార్టీ, 11. భారత్ అభ్యుదయ్ పార్టీ, 12. మన పార్టీ,13. నేషనలిస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి, 14. ప్రజా భారత్ పార్టీ, 15. ప్రజా పార్టీ, 16. ప్రజాశాంతి పార్టీ, 17. తల్లి తెలంగాణ పార్టీ, 18. యూత్ డెమొక్రటిక్ ఫ్రంట్, 19, సెక్యులర్ డెమొక్రటిక్ లేబర్ ఆఫ్ ఇండియా, 20. సురాజ్ పార్టీ.


 
							 
							