NationalNews Alert

సోషల్ మీడియాలో రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ

మూడేళ్ల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌పై సెంచరీ కొట్టి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా అరుదైన రికార్డు సృష్టించాడు. కోహ్లీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఫాలోవర్ల సంఖ్య తాజాగా 50 మిలియన్లు దాటేసింది. అంటే దాదాపు ఐదు కోట్ల మంది విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్నారన్నమాట. ట్విట్టర్‌లో అత్యధికులు ఫాలో అవుతున్న క్రికెటర్ విరాట్ కోహ్లీనే కావడం విశేషం.

 33 ఏళ్ల విరాట్‌కి మీడియాలో ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 211 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్‌లో 49 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో 310 మిలియన్లకు పైగా కోహ్లీని ఫాలో చేస్తున్నారు. అంటే దాదాపు 31 కోట్ల మంది అన్నమాట. మనదేశానికి చెందిన ఈ యంగ్ క్రికెటర్‌ను ఇంతమంది ఫాలో అవ్వడం సంతోషించదగిన విషయం కదా.